బంపర్ ఆఫర్ అందుకున్న కావ్య థాపర్.. స్ స్టార్ హీరో మూవీలో 

21 August 2023

Pic Credit - Instagram

2018లో ఎంట్రీ ఇచ్చిన కావ్య థాపర్. ఈ మాయ పేరేమిటో  అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కావ్య థాపర్

సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా ..  గ్లామర్ పరంగా ఈ అమ్మడికి మంచి మార్కులు పడ్డాయి

ఈ ముద్దుగుమ్మకు ఆరంభంలో విజయాలు పెద్దగా పలకరించలేదు. కావ్య చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కే=బోల్తా కొట్టాయి.

తెలుగుతోపాటు తమిళ్ భాషలోనూ అవకాశాలు అందుకుంటుంది కావ్య. స్టార్ హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది ఈ చిన్నది

రీసెంట్ గా విజయ్ ఆంటోనితో కలిసి నటించింది. విజయ్ నటించిన 'బిచ్చగాడు 2'తో కావ్యకు మంచి గుర్తింపు దక్కింది.

ఇక ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగులో ఓ క్రేజీ ఆఫర్ ను అందుకుంది. మాస్ మహారాజ రవితేజ కు జోడిగా నటిస్తుంది కావ్య

రవితేజ హీరోగా నటిస్తున్న ఈగల్ అనే సినిమాలో నటిస్తుంది కావ్య. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది .

తెలుగులో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న కావ్య..  ఆశలన్నీ 'ఈగల్' సినిమాపైనే పెట్టుకుంది. మరి ఈ సినిమా అమ్మడికి ఎలాంటి హిట్ ఇస్థుందో చూడాలి.