తమిళ్ లో రెండు.. తెలుగులో ఒకటి.. ఈషా స్పీడ్ పెంచిందిగా..

28 August 2023

Pic Credit - Instagram

అంతకు ముందు ఆతర్వాత అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ ఈషా రెబ్బ. తెలుగమ్మాయి అయిన ఈ భామకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు

తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా అవకాశం అందుకోలేక పోయింది

సెకండ్ హీరోయిన్ గా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది ఈషా.

ఈషా వెండితెరకు పరిచయమై చాలా కాలమే అయ్యింది. హీరోయిన్ గా నిలదొక్కుకోవడం కోసం ఈ అమ్మడు గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది.

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆతర్వాత వెబ్ సిరీస్ లు కూడా చేసింది.

3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, టాలెంట్ ఉండి కూడా సరైన గుర్తింపుకు నోచుకోలేకపోతుంది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం వెరైటీ వెరైటీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

ప్రస్తుతం రెండు తమిళ చిత్రాలతో పాటు.. ఓ తెలుగు మూవీలో నటిస్తోంది ఈషా. వీటిలో ఏది హిట్ అయినా ఈ అమ్మడు కెరీర్ ఊపందుకుంటుంది.