'మా ఇంటి బంగారం' సినిమాకు సమంత రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

30  June 2026

Basha Shek

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఈ సినిమా జోరు చూస్తుంటే త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టడం ఖాయమని తెలుస్తోంది. నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఇదిలా ఉంటే భారీ కలెక్షన్లతో దూసుకుపోతోన్న 'మా ఇంటి బంగారం' సినిమాకు సమంత ఎంత పారితోషికం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కాగా ఈ మూవీకి సమంత పారితోషికం తీసుకోలేదు. ఎందుకంటే ఈ సినిమాకు ఆమెనే నిర్మాత.  సినిమా హిట్‌ అయితే ఏడు కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుంటానందట.

అలాగే సినిమాకు వచ్చే లాభాల్లోనూ సమంతకు భాగం ఉందట. ఇలా పారితోషికంతో పాటు ఓవరాల్ గా ఆమెకు సుమారు రూ.30-40కోట్ల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది.

మా ఇంటి బంగారం సినిమాకు విదేశాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ మూవీ కలెక్షన్లు 2 మిలియన్ డాలర్లను దాటి పోయాయి.

పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడం, మౌత్ టాక్ బాగుండడంతో సమంత సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు

 మా ఇంటి బంగారం సినిమాలో సమంతో పాటు యాంకర్ శ్రీముఖి, సీనియర్ నటి గౌతమి, గుల్షన్ దేవయ్య, మంజూష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.