బిగ్‏బాస్ సీజన్ 7 రాబోతుంది.. ఇప్పటివరకు విన్నర్స్ వీళ్లే.. 

28 August 2023

Pic credit - Instagram

సెప్టెంబర్ 3న బిగ్‏బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతుంది. ఇప్పటివరకు ఆరు సీజన్స్ విజయవంతగా పూర్తి అయ్యాయి. మరీ ఆరుగురు విన్నర్స్ తెలుసుకుందామా. 

ఫస్ట్ సీజన్  విన్నర్ నటుడు శివబాలాజీ. ఈ సీజన్ హోస్టింగ్ ఎన్టీఆర్ చేశారు. ఇప్పటికీ అన్ని సీజన్స్ కంటే ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయ్యింది. 

ఇక ఆ తర్వాత సీజన్ 2లో కౌశల్ విన్నర్ అయ్యారు. ఈ సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇక మూడవ సీజన్ లో సింగర్ రాహుల్ సింప్లిగంజ్ విజేతగా నిలిచారు. ఈ సీజన్ కు అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేశారు. 

అలాగే నాల్గవ సీజన్ లో టాలీవుడ్ యంగ్ హీరో అభిజిత్ విన్నర్ అయ్యారు. ఈ సీజన్ ప్రేక్షకులకు కొంతమేర మెప్పించిందనే చెప్పాలి. 

సీజన్ 1 తర్వాత ప్రేక్షకులకు ఎక్కువగా అలరించిన సీజన్ 5. ఇందులో సీరియల్ నటుడు సన్నీ విజేతగా నిలవగా.. అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇప్పటివరకు జరిగిన సీజన్స్ అన్నిటికంటే సీజన్ 6 అట్టర్ ప్లాప్ అయింది. ఈ సీజన్ 6 విజేతగా సింగర్ రేవంత్ గెలిచారు. 

ఇక ఇప్పుడు బిగ్‏బాస్ సీజన్ 7 రాబోతుంది. ఈ సీజన్ లో రాబోతున్న కంటెస్టెంట్స్ విషయంలో ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.