27 August 2023

తమ్ముడికి అమ్మాయి గెటప్ వేసి చెల్లిగా ఫీలవుతున్న అనుపమ పరమేశ్వరన్.. 

Pic credit - Instagram

తెలుగు సినీపరిశ్రమలో అనుపమకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అఆ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అనుపమ పరమేశ్వరన్. 

ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం డీజే టిల్లు చిత్రంలో నటిస్తుంది అనుపమ. 

అనుపమకు అక్షయ్ అనే ఓ తమ్ముడు ఉన్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తమ్ముడు గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

ఇద్దరి వయసు తేడా రెండేళ్లే అని.. తన తమ్ముడిని పెట్ లా ఫీలవుతుంటా అని.. రకరకాల గెటప్స్ వేసి ఫోటోషూట్స్ చేస్తుంటా అని తెలిపింది. 

తాను అడిగిందల్లా చేసే తన తమ్ముడికి అమ్మాయిగా గెటప్ వేసి చెల్లిగానూ మార్చుకుంటానని.. ఆరకంగా చెల్లి లేని లోటు తీర్చుకుంటానని తెలిపింది. 

తాను ఏం చేసినా వాడు ఫీలవ్వడు అని.. అక్క కోసం ఆ మాత్రం చేస్తానని అంటుండాని చెప్పుకొచ్చింది అనుపమ. తన తమ్ముడితో సరదాగా ఉంటానని తెలిపింది. 

చాలాసార్లు అనుపమ తన తమ్ముడు అక్షయ్‏ను ఆటపట్టిస్తోన్న వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. 

ప్రస్తుతం అనుపమ డీజే టిల్లు సినిమాలో నటిస్తోంది. తమిళ్, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది అనుపమ.