ఎవరో గుర్తుపట్టారా ?.. అమ్మాయిల హృదయాలను దొచుకున్న సింగర్.. 

27 August 2023

Pic credit - Instagram

బీటీఎస్ (BTS) ప్రపంచవ్యాప్తంగా యూత్‏కు తెలిసిన పేరు. సోషల్ మీడియాలో బీటీఎస్ ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. 

బీటీఎస్ అంటే బ్యాంగటన్ బాయ్స్. ఎలాంటి విమర్శలు వచ్చిన తట్టుకుని నిలబడాలనే ఆలోచనతో బుల్లెట్ ఫ్రూవ్ బాయ్స్ స్కౌట్ అని అర్థం. 

ఈ గ్రూప్‏లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఆర్ఎమ్, జిన్, సుగా, జేహూఫ్, వీ, జిమిన్, జంగ్‏కుక్. వీరికి ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారు. 

పైన ఫోటోలో కనిపిస్తోన్న వ్యక్తి బీటీఎస్‏లోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వి (V) అలియాస్ కిమ్ తహ్యూంగ్(Kim Taehyung). వరల్డ్ మోస్ట్ హ్యండ్సమ్ మెన్. 

ఇటీవల జపాన్ వెళ్లిన వి.. ఇప్పుడు తిరిగి సౌత్ కొరియాకు చేరుకున్నాడు. గింపో అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈ సర్ ప్రైజ్ లుక్ లో కనిపించారు. 

కిమ్ ను ఎయిర్ పోర్టులో చూడగనే అక్కడకు ఒక్కసారిగా అభిమానులు చేరుకున్నారు. వెంటనే మీడియా, అభిమానులతో ఎయిర్ పోర్ట్ నిండిపోయింది. 

 వీ (v)ని చూడగానే అభిమానులు అతని పేరును గట్టిగా అరిచారు. ఇక తన ఫ్యాన్స్ ను చూసిన కిమ్.. చిరునవ్వుతో ముందుకు నడిచారు. 

గళ్ల చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించి, బీనీ, హెడ్ ఫోన్స్ ధరించిన కిమ్.. ముఖానికి మాస్క్ ధరించి కనిపించారు. అతని లుక్ అందరిని ఆకర్షించింది.