24 August 2023
పాత్రకు ప్రాణం పెట్టిన అలియా.. ఉత్తమనటిగా నిలిచింది.
Pic credit - Instagram
అలియాభట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియాభట్ ఒకరు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది.
స్టార్ హీరోయిన్గా అలియా..
ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. షారుఖ్, రణ్వీర్, రణబీర్ కపూర్ సరసన నటించి మెప్పించింది.
గంగూబాయి కతియావాడి
తాజాగా గంగూబాయి కతియావాడి చిత్రానికిగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డుకు ఎంపికైంది అలియా. ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు.
రూ.210 కోట్ల కలెక్షన్స్..
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.210 కోట్లు వసూళు చేసింది. వేశ్య పాత్రలో అలియా నట విశ్వరూపం పాన్ ఇండియా సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది.
గంగూబాయి జీవిత కథ
ముంబయి మాఫీయా క్వీన్ గా పేరొందిన గంగూబాయి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.
అలియా మూడేళ్లు ప్రయాణం
ఈ చిత్రంలోని పాత్రతో అలియా మూడేళ్లు ప్రయాణం చేసింది. కొన్నిసార్లు తనకు తెలియకుండానే గంగూబాయిలా కూర్చోవడం, ఆమెలా మాట్లాడటం చేసేదట.
అలియాను చేరిన అవకాశం..
వేశ్వ పాత్ర కావడంతో ప్రియాంక, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ ఈ సినిమాకు ఒప్పుకోకపోవడంతో అలియా ఆ అవకాశాన్ని అందుకుని టాక్.
విమర్శలకు సినిమాతో సమాధానం..
ఈ సినిమాతో నటిగా తనను తాను నిరూపించుకుంది అలియా. అప్పటివరకు తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టింది ఈ అందాల తార.
ఇక్కడ క్లిక్ చేయండి.