అభిమానులకు షాక్ ఇచ్చిన శ్రీలీల.. సినిమాలకు బ్రేక్ 

22 August 2023

Pic Credit - Instagram

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ అందం శ్రీలీల.

ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. శ్రీలీల ఇటీవల రవితేజ సరసన ధమాకాలో నటించి మరో హిట్‌ను అందుకుంది.

ప్రస్తుతం తెలుగులో ఓ 10 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అభిమానులకు షాక్ ఇచ్చింది శ్రీలీల.

మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా, పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ ల ‘ఉస్తాద్ భగత్ సింగ్‌లతో పాటు బాలయ్య భగవంత్ కేసరిలో కూడా నటిస్తుంది.

శ్రీలీల ఓ రెండు నెలలు అన్ని సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల ప్రస్తుతం చదువుకుంటూనే.. సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ భామ ఓ పది సినిమాల్లో నటిస్తూ.. సూపర్ బిజీగా ఉంది. అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లో మాత్రం సినిమాలకు రెండు నెలలు బ్రేక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు నెలల్లో ఆమెకు పరీక్షలు ఉన్నాయట. శ్రీలీల ప్రస్తుతం MBBS లాస్ట్ ఇయర్ చదువుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఓ రెండు నెలలు బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆమె షూటింగ్స్ విషయంలో నిర్మాతలు దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారట.