26 August 2023

రామాయణం సీత పాత్రలో కనిపించనున్న సాయి పల్లవి..

Pic credit - Instagram

సాయిపల్లవి చివరిసారిగా గార్గి చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మరోసారి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

ప్రస్తుతం ఆమె తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. 

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న రామాయణం సినిమాలో సాయి పల్లవి నటించనుందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. 

ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటించే అవకాశాలున్నాయని ముందు నుంచి ఊహాగానాలు సాగుతున్నాయి. 

ఇక ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి నటించనుందని ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. 

ముందుగా ఈ పాత్రకు అలియా భట్ అనుకున్నారట మేకర్స్. అయితే ఇప్పుడు తనకు కాల్షీట్స్ సమస్య తలెత్తిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 

నితేష్ తివారీ తెరకెక్కించే రామాయణంలో సాయి పల్లవి సీత పాత్రలో నటించేందుకు ఆమె త్వరలోనే మేకర్స్ సంప్రదించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఒకవేళ ఈ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సౌత్ ఇండస్ట్రీలో  ఈమూవీపై మరింత ఆసక్తి నెలకొనడం ఖాయమంటున్నారు న్యాచురల్ బ్యూటీ ఫ్యాన్స్.