పట్టు పరికిణిల్లో బుల్లితెర ముద్దుగుమ్మలు.. 

25 August 2023

Pic credit - Instagram

గుప్పెడంత మనసు 

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది కన్నడ భామ రక్ష గౌడ. ఇందులో వసుధార పాత్రలో తన నటనతో మెప్పించింది. 

ఎన్నెన్నో జన్మల బంధం

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా బుల్లితెరపై సందడి చేసింది బెంగాల్ బ్యూటీ దేబ్జానీ మోదక్. అందం, అభినయం కలబోసిన బుట్టబొమ్మ. 

బ్రహ్మముడి

ఇక ఇప్పుడిప్పుడే బ్రహ్మముడి సీరియల్ ద్వారా కావ్య పాత్రతో అడియన్స్ కు దగ్గరవుతుంది దీపికా రంగరాజు. ఇందులో తల్లిదండ్రుల కోసం ఆరాటపడే కూతురిగా కనిపిస్తుంది. 

నాగపంచమి

అలాగే నాగపంచమి సీరియల్ ప్రధాన కథానాయిక దర్శిని గౌడ. అందమైన రూపం.. మనసులను హత్తుకునే నటనతో మెప్పిస్తుంది. 

 కార్తీక దీపం

ఇక కార్తీక దీపం సీరియల్ మోనిత పాత్రతో ఇప్పటికే తెలుగు వారి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది కన్నడ బ్యూటీ శోభా శెట్టి. 

 కృష్ణ ముకుంద మురారి

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యింది ప్రేరణ. ఇందులో కృష్ణ అల్లరి పిల్లగా మెప్పిస్తోంది ప్రేరణ. 

 కృష్ణ ముకుంద మురారి

అలాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో తన ప్రేమ కోసం తపనపడే ముకుంద పాత్రలో నటిస్తోంది యష్మీ గౌడ. ఇందులో ముకుంద  నటనతో మెప్పించింది. 

బ్రహ్మముడి

బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన హమిదా ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్లో స్వప్న పాత్రలో అలరిస్తోంది. ఇందులో పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.