సోషల్ మీడియాలో మృణాల్ మెరుపులు.. 

16 August 2023

Pic Credit - Instagram

సీతారామం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించిన మృణాల్ ఠాకూర్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.

ఈ అమ్మడి నటనకు అందానికి కుర్రకారంతా దాసోహం అయ్యారనే చెప్పాలి. తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

ఈ అమ్మడికి ఇటీవ‌ల మెల్ బోర్న్ ఫిలింఫెస్టివ‌ల్ లో అరుదైన గౌర‌వం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే.

మృణాల్ కి సోష‌ల్ మీడియాల్లోవిపరీతమైన ఫాలోయింగ్ ఉంది . ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడికి దాదాపు 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు

ఈ బ్యూటీ నిరంత‌రం వరుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ యూత్ లోకి దూసుకెళుతోంది. మోడ్రన్ ఫోటో షూట్స్ తో పాటు ట్రెడిషనల్ లుక్ లోనూ ఆకట్టుకుంటుంది.

మృణాల్ తాజా ఫోటోషూట్ సోషల్ మీడియాలో  దుమ్ము రేపుతోంది. లేత నీలిరంగు గౌను అదరగొట్టింది మృణాల్

ఈ నేచుర‌ల్ లుక్ నెటిజ‌నుల‌ను విప‌రీతంగా ఆక‌ర్షించింది. అలా అందంగా స్మైలిస్తున్న మృణాల్ కట్టిపడేస్తుంది

ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది. అలాగేస్టార్ హీరోలు మ‌హేష్ -చ‌ర‌ణ్- బ‌న్ని- ప్ర‌భాస్ లాంటి స్టార్ల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకోవాల‌ని ట్రై చేస్తుంది.