ఇన్నాళ్లకు మళ్లీ ఫుల్ లెన్త్ రోల్ అందుకున్న మీరా జాస్మిన్..

16 August 2023

Pic credit - Instagram

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ మీరా జాస్మిన్. చూపు తిప్పుకోనివ్వలేని అందం కట్టిపడేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రవితేజ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్.

అంతలోనే సినిమాలకు దూరమైంది మీరా. చాలాకాలం పాటు ఎవరికీ కనిపించకుండా దూరంగా ఉండిపోయింది మీరా జాస్మిన్. 

ఇక ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది మీరా జాస్మిన్.ఇటీవల విమానం సినిమాలో కనిపించింది మీరా. 

తాజాగా మీరాకు ఫుల్ లెన్త్ రోల్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. అది కూడా ఓ యంగ్ హీరో సినిమాలో అని తెలుస్తోంది. 

యంగ్ హీరో శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా ఓ సినిమా రాబోతుంది. అందులో కీలకపాత్రలో మీరాను తీసుకున్నారట.

ఈ సినిమాకు స్వాగ్ అనే పేరును ఖారారు చేసింది చిత్రయూనిట్. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇది లక్కీఛాన్స్అని తెలుస్తోంది. 

ఇందులో మీరాకు హీరోయిన్ ఛాన్స్ అని తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.