ఓనం సంబరాల్లో వెన్నెలమ్మ.. మాళవికా మోహనన్ పిక్స్  

30 August 2023

Pic Credit - Instagram

చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్న భామల్లో మాళవిక మోహనన్ ఒకరు. ఈ భామ చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తనదైన డ్రెసింగ్ స్టైల్స్‌తో నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది ఈ చిన్నది. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాటపడదు ఈ చిన్నది.

తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు ఈ బ్యూటీ. కానీ తమిళ్, మలయాళ భాషల్లో సినిమాల్లో చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ముఖ్యంగా తమిళ్ లో దళపతి విజయ్ తో కలిసి మాస్టర్ సినిమాలో నటించింది. అలాగే ధనుష్ తో కలిసి మారన్ అనే సినిమా చేసింది.

ఇక ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది మాళవికా మోహనన్. త్వరలోనే ఆమె స్టార్ హీరో ప్రభాస్ తో సినిమా చేస్తుందని టాక్.

మారుతి, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న రాజా డిలక్స్ అనే సినిమాలో నటిస్తుంది మాళవికా మోహనన్. ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో మాళవికా మోహానన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం వెరైటీ ఫోటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది.

తాజాగా ఓనం సందర్భంగా మాళవికా మోహనన్ సాంప్రదాయ చీరకట్టులో కనిపించి ఆకట్టుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.