మానసిక ఒత్తిడి, ఊబకాయం, మలబద్ధకం వంటి వాటికి కొన్ని ఆహార పదార్థాలు దివ్యఔషధంలా పనిచేస్తాయి. అలాంటి వాటిల్లో కీర దోసకాయ ఒకటి. కీరదోసల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
చాలా మంది సమ్మర్ లో కీరదోస కాయలను ఎక్కువగా తింటారు. కీర దోసకాయలను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతుంటారు.
కీర దోసకాయను సాల్ట్ వేసి తినాలి. మరికొందరు కీరాను, ముఖానికి మాస్క్ లాగా పెట్టుకుంటారు. కంటి సమస్యలున్న వారు.. రాత్రిపూట కీర దోసకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి కళ్లమీద పెట్టుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
కళ్ల మీద పెట్టుకుంటే, వేడిమి నుంచి ఎంతో ఉపశమనం కల్గుతుంది. అన్నం తిన్నాక తింటే చక్కగా అరుగుతుంది. కీరను పప్పులలో, ఆవకాయలుగా, చట్నీలుగా కొందరు చేసుకుంటారు.
జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు తింటే ఎంతో మేలు కల్గిస్తుంది. నోటిలో పుండ్లు ఉన్న వారు, పొట్టలో పుండ్లున్నవారు కీరాను ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.
డయాబెటిక్ రోగులకు కీరదోస ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తుంది. దీనిలో మాంగనీస్, జింక్, ఫాస్పరస్, విటమిన్లు ఉంటాయి. కీరను తింటే శరీరంలో వ్యర్థాలు మూత్రం రూపంలో బైటకు వెళ్లిపోతాయి.
కీరదోసను ఎక్కువగా తింటే క్రమంగా ఊబకాయం తగ్గిపోతుందని నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజు ఉదయం పూట కీర దోస లేదా దీనితో తయారు చేసిన జ్యూస్ తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది.
కీర దోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం డీహైడ్రేషన్ అవకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే విటమిన్ ‘బి’తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా దోహదపడుతుంది. కీరదోసలో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉన్నాయి.