రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఎప్పటినుంచంటే..?

12 December 2023

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్న హామీ కూడా ఒకటి.

ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈ పథకం కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

రూ.500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఎప్పటి నుంచి ఇస్తారంటూ జనం గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర ఆరా తీస్తున్నారు.

ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అదనంగా డాక్యుమెంట్లు ఏమైనా సమర్పించాలా? అనే అంశంపై వివరాల కోసం గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర క్యూకడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఈ పథకాన్ని అమలు చేయలేదని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలోని ప్రతినిధులు వివరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖపై సమీక్ష జరిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రూ.500 గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ ఇచ్చారు.

వంద రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీని అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

అలాగే తెలంగాణాలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.