ఇటీవల తెలంగాణాలో అమలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు సమ్మెకు సిద్ధమయ్యారు.
తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్‌కు వాహన సంఘాలు పిలుపునిచ్చాయి.
తెలంగాణ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు (JAC) తాజాగా రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు.
రవాణా రంగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎండగడతామని తెలిపారు.
బంద్‌కు ఇతర సంఘాలు మద్ధతు తెలిపాయి. టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడారు.
అయన మాటల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు వేముల మారయ్య.
రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య.
ప్రతీ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ. 15 వేలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.