వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు
TV9 Telugu
11 January 2024
తెలంగాణ రాష్ట్రంలోని చలాన్లు పెండింగ్ ఉన్న అన్ని రకాల వాహనదారులకు టీఎస్ పోలీసుశాఖ శుభవార్త చెప్పింది.
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది తెలంగాణ పోలీస్‌శాఖ.
వాస్తవానికి గడువు నేటితో జనవరి 10న ముగియగా.. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు స్పందన వస్తుండడంతో గడువును పొడిగించింది ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.59కోట్ల వివిధ రకాల ట్రాఫిక్ చలాన్లు వాహనాలపై పెండింగ్‌లో ఉన్నాయి.
అయితే, పోలీసుశాఖ రాయితీపై పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు గడువు ఇవ్వడంతో వాహనదారులు చెల్లిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సాంకేతిక సమస్యలతో చెల్లింపుల్లో ఆలస్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర పోలీసు వర్గాలు తెలిపాయి.
ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80శాతం రాయితీ.. ఆర్టీసీ బస్సులకు 90శాతం, ఇతర వాహనాలకు 60శాతం రాయితీ రాయితీని ప్రకటించారు.
రాయితీపై పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు గడువు తేదీ పొడిగించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి