17 November 2023

కాంగ్రెస్ మేనిఫెస్టో ముఖ్యమైన హామీలు ఇవే.!

మొత్తం 62 ప్రధాన అంశాలతో తెలంగాణ ఎన్నికల తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేనిన ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖర్జున ఖర్గే. 

తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.25 వేల పింఛన్. ఆయా కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. 

తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం.

రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీ. అలాగే రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలు.

ధరణీ స్థానంలో ‘భూమాత’ పోర్టల్‌. 

నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి. వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా రూ.2 లక్షల ఉద్యోగాల భర్తీ.

ఆడపిల్లల పెళ్లికి రూ.లక్షతో పాటు 10 గ్రాముల బంగారం.

కాలేజీకి వెళ్లే విద్యార్థులకు విద్యా భరోసా కింద రూ.5 లక్షలు. 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థికి స్కూటీ.

నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం.