తెలంగాణలో MLC ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

TV9 Telugu

04 January 2024

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు MLC స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.

ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేయడంతో ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.

స్టేషన్‌ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, హుజూరాబాద్‌ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్.

జనవరి 11వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది ఎన్నికల కమిషన్.

జనవరి 29వ తేదీన ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌. అదేరోజు సా.5 గంటల నుంచి కౌంటింగ్‌ కూడా జరగనుంది.

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంః జనవరి 11, 2024, నామినేషన్ల స్వీకరణకు గడువు జనవరి 18, 2024గా ప్రకటించింది.

స్క్రూటినీ ప్రక్రియః జనవరి 19, 2024, నామినేషన్ల ఉపసంహరణకు గడువుః జనవరి 22, 2024గా తెలిపింది ఎలక్షన్ కమిషన్.