హైదరాబాద్‌లో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
TV9 Telugu
21 January 2024
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చలికాలం పూర్తికాకముందే పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు భారీగా పెరిగుతున్నాయి.
దింతో చలికాలం అప్పుడే వీడి వెళుతుందా.. అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ప్రజలు.
గతంలో సంక్రాంతి పండక్కి రాత్రి వేళల్లో ఎంత చల్లగా ఉన్నప్పటికీ, పగటిపూట కొంతమేర వాతావరణం వేడిగా ఉండింది.
కానీ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ఉన్న వేడి వాతావరణం చూసి హైదరాబాద్ నగర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఆగ్నేయం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తున్న గాలుల ప్రభావం కారణంగా అంటున్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
అయితే వారం రోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదవుతున్నాయి. ఫలితంగా ఉక్కపోత తప్పడం లేదు.
జనవరి 19న నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18.2 డిగ్రీలు, గాలిలో తేమ 41 శాతంగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇప్పుడే వాతావరణం ఇలా ఉంటె రానున్న వేసవిలో ఉష్ణోగ్రతలు ఇంకెంత పెరగనున్నాయో అని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి