23 November 2023

టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

 " తెలంగాణ ప్రజలకు... కేసీఆర్‌పై ప్రేమ ఉంది. తెలంగాణ సాధించిన నేతగా కేసీఆర్‌పై ఆరాధాన భావం ఉంది"

 " మార్పు కావాలని కోరుకుంటున్నది కేవలం రాజకీయ నిరుద్యోగులే. ప్రజలు మంచి పనులు కొనసాగాలని కోరుకుంటున్నారు"

"కాంగ్రెస్‌ చెబుతోన్న మార్పును తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదు. ఇందిరమ్మ రాజ్యం అట్టర్‌ప్లాప్‌ అందుకే ఆనాడు ఎన్టీఆర్‌కు ప్రజలు పట్టంకట్టారు. ఆ ఎన్టీఆర్‌ శిష్యుడే ఇప్పుడు హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారు"

"తెలంగాణ కాంగ్రెస్‌... ఆంధ్రా కాంగ్రెస్‌ ఉండదు... ఉండేది ఒక్క ఢిల్లీ కాంగ్రెస్‌ మాత్రమే. ముంచేవాళ్లను తెలంగాణ ప్రజలు నమ్మరు.కాంగ్రెస్‌ నేతల జుట్టు ...ఢిల్లీ చేతిలో ఉంటుంది"

"కాంగ్రెస్‌కు తెలంగాణలో బేస్‌ లేదు. తెలంగాణలో ఎప్పుడూ 56-57 సీట్లు గెలవలేదు. చివరికి వైఎస్‌ హయాంలో కూడా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవలేదు"

"డిసెంబర్‌ 3న ఈవీఎంలు తెరిచాక కాంగ్రెస్‌ బలం నీటి బుడగని తేలిపోతుంది. మేం ఏం చేశామో చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం. అనేక రంగాల్లో తెలంగాణను నెంబర్‌వన్‌ ప్లేస్‌లో పెట్టాం"

"తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్నది మమకారం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత చాలా తక్కువ. ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు జరుగుతోన్న యుద్ధం ఇది"

"కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీ డౌన్‌ అయ్యింది... కాంగ్రెస్‌కు కొంచెం పుంజుకుంది. కాంగ్రెస్‌, బీజేపీ రెండూ కూడా సెకండ్‌ ప్లేస్‌ కోసమే కొట్టుకుంటున్నాయి"