హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో.. లేటెస్ట్ అప్డేట్ ఇదీ..
19 August 2023
ఓల్డ్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగించేందుకు భూసార పరీక్షలు నిర్వహించనున్నది హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ.
మొదటి దశ మెట్రో ప్రాజెక్టులో భాగంగా పెండింగ్‌లో ఉన్న ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మార్గాన్ని పూర్తిచేయనుంది.
పెండింగ్‌లో ఉన్న పాతబస్తి మెట్రో రైలు నిర్మాణం పూర్తిచేయాలని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో సంస్థకు సూచించింది తెలంగాణ ప్రభుత్వం.
ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ సంస్థ ఆ మార్గంలో రైట్ ఆఫ్ వేకు సంబంధిత ఆస్తులను గుర్తించి తొలగించుటకు చర్యలు చేపట్టింది.
మెట్రో నిర్మాణ మార్గం ఖరారు కావడంతో పిల్లర్లు నిర్మించే ఏరియాలో భూసార పరీక్షలు చేసినందుకు సిద్ధమవుతున్నారు.
భూసార పరీక్షల కోసం దాదాపు రూ.25 లక్షల ఖర్చుతో జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌ను మొదలు పెట్టనున్నారు.
ఈ మెట్రో మార్గం నిర్మణానికి సంబంధించి పనులు చేపట్టే ప్రైవేటు సంస్థలను ఎంపిక చేస్తున్నామని తెలిపారు.
క్షేత్ర స్థాయిలో భూసార పరీక్షలకు సంబంధించిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నివేదిక రాగానే ఫిల్లర్లను నిర్మాణం మొదలుపెడతామని వెల్లడించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి