నెలరోజుల్లో హైడ్రా సాధించిన విజయాలు ఇవే!
TV9 Telugu
26 August 2024
హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 18చోట్ల కూల్చివేతలు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది హైడ్రా.
పలువురు ప్రముఖులతోపాటు రియల్ ఎస్టేట్ సంస్థల కబ్జాలపై కూల్చివేతలు.18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని కాపాడిన హైడ్రా.
నందినగర్‌లో ఎకరం స్థలాన్ని కబ్జాకోరుల నుంచి కాపాడిన హైడ్రా. లోటస్ పాండ్ లో పార్కు కాంపౌండ్ వాల్ కబ్జా చేసిన దానిని కాపాడిన హైడ్రా.
మన్సూరాబాద్ సహారా ఎస్టేట్‌లో జరిగిన కబ్జాలు కూల్చివేత. బి జె ఆర్ నగర్ లో నాలా కబ్జా నుంచి కాపాడిన హైడ్రా.
ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా కూల్చివేత. మిథాలీ నగర్ లో పార్క్ స్థలాన్ని కాపాడిన హైడ్రా.
గాజులరామారం మహాదేవ్ నగరంలో రెండంతస్తుల భవనం కూల్చివేత. గాజుల రామారావు భూదేవి హిల్స్‌లో చెరువు ఆక్రములను చేసిన బోనాలు కూల్చివేత.
బంజారాహిల్స్‌లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేత. చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసిన హైడ్రా.
నందగిరి హిల్స్ లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేత. అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి