ఎన్నికల్లో తమకు ఓటు హక్కు ఉందా? లేదా?, ఓటు హక్కు ఉంటే ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలనే దానిపై చాలా మందికి సందేహాలున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలోని మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేసింది. నవంబర్ 25తో ఈ ప్రక్రియ పూర్తయింది.
అయినా వివిధ కారణాల వల్ల ఇంకా కొందరికి ఓటరు స్లిప్పులు అందకపోవడంతో వాటిని ఓటర్లే నేరుగా పొందేందుకు ఎన్నికల సంఘం వీలు కల్పించింది.
ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేయడం ద్వారా ఓటర్లు ఓటర్ జాబితాలో తమ పేరు ఉందా.. లేదా..? అని చెక్ చేసుకోవచ్చు
దీంతో పాటు, సులువుగా ఓటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ ఓటర్ స్లిప్‌లో పోలింగ్ బూత్ వివరాలు, పోలింగ్ తేదీ, ఓటర్ సీరియల్ నంబర్ తదితర వివరాలు ఉంటాయి.
నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ (NVSP) వెబ్‌సైట్ https://www.nvsp.in లోకి వెళ్లి వివరాలను ఎంటర్ చేసి వోటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోండి
ఎస్సెమ్మెస్‌తో ఓటర్ లిస్టు చెక్ చేసే అవకాశాన్ని సైట్ అందిస్తుంది. ఒకవేళ ఓటర్ లిస్టులో మీ పేరు లేకపోతే.. మీకు ‘నో రికార్డ్ ఫౌండ్’ అని సమాధానం వస్తుంది.