14 September 2023

హైదరాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం..

సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే అనవసర కష్టాలు తెచ్చుకుంటారు జాగ్రత్త.

స్నేహం లేదా ప్రేమ ముసుగులో మిమ్మల్ని నిలుపున దోచుకునేందుకు ప్రయత్నించే కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికలో చాలా మందే ఉన్నారు. 

హైదరాబాద్‌లో మరో హనీ ట్రాప్ కేసు కలకలం సృష్టించింది. ఓ చిరు వ్యాపారి సోషల్ మీడియాలో పరిచయమైన యువతి హనీట్రాప్‌లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన 32 ఏళ్ల చిరు వ్యాపారికి ఫేస్‌బుక్‌లో ఓ యువతి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇలా ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ మొబైల్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. 

ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగాక.. వాట్సప్ కాల్‌లో బట్టలు తీసి నగ్నంగా కనిపించాలని ఆ వ్యాపారిని యువతి కోరింది. యువతి మోసాన్ని పసిగట్టలేకపోయిన ఆ వ్యాపారి కూడా అలాగే చేశాడు.

వ్యాపారి నగ్నంగా ఉండడాన్ని వీడియో తీసిన ఆ యువతి.. డబ్బు కోసం బెదిరింపులు మొదలుపెట్టింది. డబ్బులు ఇవ్వకుంటే నగ్నంగా ఉన్న వీడియోలు బయటపెడుతానని బెదిరించింది. 

విడతల వారీగా డబ్బులు చెల్లించినా బెదిరింపులు ఆగకపోవడంతో ఆ చిరు వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. 

హనీ ట్రాప్‌తో ఆ చిరు వ్యాపారి దగ్గరి నుంచి విడతలవారీగా ఆ కంత్రీ లేడీ రూ.1.53 లక్షలు కొట్టేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.