హుక్కాపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

TV9 Telugu

12 February  2024

ప్రస్తుతకాలంలో మద్యం సేవించడం, పోగతాగడంతో పాటు హుక్కా కూడా ఒక వ్యసనంగా మారిపోయింది. చాలామంది దీనికి అలవాటు పడిపోయారు.

సిగరెట్‌తో పోల్చుకుంటే హుక్కా సెషన్‌లో దాదాపు 125 రెట్లు పొగ, 25 రెట్లు తారు, 2.5 రెట్లు నికోటిన్, 10 రెట్లు కార్బన్ మోనాక్సైడ్‌ విడుదలవుతుంది.

ఒక్కసారి హుక్కాకు అలవాటు పడితే యువత దాని నుంచి ఇంకా బయటకి రాలేకపోతున్నారు. దీంతో అనారోగ్యానికి గురి అవుతున్నారు.

తరుచూ హుక్కా వినియోగం క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధి వంటి వాటికీ కారణం అవుతుంది.

సంతానోత్పత్తి తగ్గడం, తక్కువ ఎముక సాంద్రత, గర్భధారణ సమస్యలు, పుట్టుకతో వచ్చే సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇటీవల రాష్ట్రంలో హుక్కా వినియోగం ఎక్కువ అవడంతో తాజాగా తెలంగాణ ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో హుక్కా కేంద్రాలను నిషేదించే సవరణ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు  సభలో ప్రవేశ పెట్టగా  దానికి ఆమోదం లభించింది.

మాదకద్రవ్యాల నుంచి యువతను కాపాడేందుకు తీసుకొచ్చిన బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు సభకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు.