డిసెంబర్ 26 నుంచి పెండింగ్ వాహన చలాన్లపై డిస్కౌంట్!
28 December 2023
TV9 Telugu
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎకడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు తెలంగాణ రాష్ట్ర పోలీసులు.
ఇలా చేయడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు.
తెలంగాణా రాష్ట్రంలో పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది.
డిసెంబర్ 26వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ చలాన్ల చెల్లింపుకు అవకాశం ఉంది.
పెండింగ్ చలాన్లు తక్షణమే చెల్లించేందుకు వాహనదారులకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, ఫోర్ వీలర్లు, లారీలు, ఇతర భారీ వాహనాలకు 60 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం రాయితీ ఇచ్చింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రూ.2 కోట్ల పైగా చలాన్లు పెండింగ్‌లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
వెంటనే మీ వాహనంపై ఉన్న ట్రాఫిక్ చలాన్లు అన్ని పూర్తి చేసింది. రాయితీ ఉన్న సమయంలో పే చేస్తే తక్కువలో అయిపోతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి