30 August 2023

హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. 

తెలంగాణలోకి పెట్టుబడి పెట్టేందుకు తరలివస్తున్న అంతర్జాతీయ సంస్థలు

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో కేంద్రం కీలక ఒప్పందం  

దేశవ్యాప్తంగా 2 డేటా సెంటర్ల ఏర్పాటు బాధ్యతలను CIPL కంపెనీకి అప్పగించిన కేంద్ర ప్రభుత్వం.

రూ.137 కోట్లతో ఒక సెంటర్ నోయిడాలో, మరొకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న CIPL కంపెనీ.

ఇప్పటికే హైదరాబాద్‌లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న మైక్రోసాఫ్ట్.

 బ్యాంక్ నోట్స్, సెక్యూరిటీ పేపర్, నాన్-జుడీషియల్ స్టాంప్ పేపర్, పోస్టల్ స్టాంప్స్, స్టేషనరీ, ప్రయాణ పత్రాలను భద్రపరిచేలా ఒప్పందం. 

గత 15 ఏళ్ళుగా రాష్ట్ర, కేంద్ర ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న టెక్నాలజీ సొల్యూషన్ కంపెనీ CPIL.  

రెండు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందానికి 'పార్గమాన్' అని పేరు పెట్టిన కేంద్ర ప్రభుత్వం. 

డేటా సెంటర్ అనేది అనేక సర్వర్లలో మొత్తం డిజిటల్ డేటాను భద్రపరిచే ప్రదేశం. 

సోషల్ మీడియా డేటాతో పాటు రైల్వేలు, ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల సమాచారం, దేశ రహస్యాలు డేటా సెంటర్‌లోనే భద్రపరుస్తారు.