భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. గత ఏడాది రికార్డు బ్రేక్..

28 September 2023

బాలాపూర్ లడ్డూ వేలం పాటపై తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టి ఉంటుంది. 1994లో రూ.450లతో మొదలయ్యింది ఈ లడ్డూ వేలం పాట.

రోనా టైంలో తప్ప 28 ఏళ్ల పాటు ఈ వేలం పాట సాగింది. రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలుకుతూ… కొన్నవారి కొంగు బంగారంగా నిలుస్తోంది.

సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ లడ్డు వేలం పాట నువ్వానేనా అన్నట్లుగా జరుగుతుంటుంది.

వాస్తవానికి 1994 నుంచి 2001 వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. ప్రస్తుతం ఈ లడ్డు లక్షాల్లో పలుకుతుంది.

కందాడ మాధవ రెడ్డి అనే వ్యక్తి పోటీపడి 2002లో లక్షా 5 వేల రూపాయలకు లడ్డూ సొంతం చేసుకున్నారు. లక్షాపైన పలకడం అదే మొదటి సారి.

2003లో లక్షన్నరకు పైన పలికిన ధర ఆ తర్వాత సంవత్సరం నుంచి ధర పెరుగుతూ వస్తోంది. అంతటి క్రేజ్ ఉంది మరి దీనికి.

గత ఏడాది వేలంలో రూ. 24.60 లక్షలు పలికిన లడ్డూను బాలాపూర్‌ ఉత్సవ సమితి సభ్యులు పొంగులేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు.

ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్‌చేస్తూ 27లక్షల రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు దాసరి దయానంద్‌రెడ్డి.