వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు
TV9 Telugu
11 January 2024
గతంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల ఫిబ్రవరి 23 2022 నాటికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2.4 కోట్ల మేర చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి.
ఈ క్రమంలోనే ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లకు భారీ రాయితీ కల్పించింది.
దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 శాతం పెండింగ్ ట్రాఫిక్ చలానాలు క్లియర్ అయ్యాయి.
2022 మార్చి 31 నాటికి కేవలం 45 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.300 కోట్ల వరకు పెండింగ్ చలానాలు వసూలయ్యాయి.
ఇప్పుడు కూడా డిసెంబర్ల 26 నుంచి జనవరి 10వ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీ కల్పించింది.
రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించారు.
దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.113 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లు అధికారుల వెల్లడి.
సాంకేతిక లోపల కారణంగా రాయితీ గడువును జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ.
ఈ నెల 31 నాటికి ఇంకా ఎన్ని పెండింగ్ చలాన్లు క్లియర్ కానున్నాయో, ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరనుందో చూడాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి