తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ వచ్చేది అప్పుడే..!

TV9 Telugu

12 March 2025

ఫోల్డబుల్ ఐఫోన్‌ ధర 2,000 నుండి 2,500 డాలర్లు (సుమారు రూ. 1.74 లక్షల నుండి రూ. 2.17 లక్షల) మధ్య ఉండవచ్చంటున్నారు.

ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను భారీ ఉత్పత్తి 2026 నాల్గవ త్రైమాసికం నుండి ప్రారంభమవుతుందన్నట్లు సమాచారం.

మొదటి బ్యాచ్‌లో 3 నుండి 5 మిలియన్ యూనిట్లు మాత్రమే తయారు చేసేందుకు ఫ్లాన్. 2027 నాటికి రెండవ తరం ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేయాలని ఆపిల్ యోచిస్తోంది.

అప్పటికి, కంపెనీ ఫోల్డబుల్ ఐఫోన్ షిప్‌మెంట్‌లు 20 మిలియన్ యూనిట్లకు చేరుకోవచ్చు. సమాచారం ప్రకారం, ఈ ఫోన్ 7.8-అంగుళాల క్రీజ్-ఫ్రీ ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

దీనికి 5.5-అంగుళాల కవర్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ టైటానియం అల్లాయ్ బాడీ, స్టెయిన్‌లెస్ స్టీల్-టైటానియం హింజ్‌తో రావచ్చు.

మడతపెట్టినప్పుడు దాని మందం 9–9.5mm ఉంటుంది. తెరిచినప్పుడు మందం 4.5–4.8mm ఉంటుంది. ఇదిడిజైన్‌లో Samsung Galaxy Z Fold 7ని పోలి ఉండవచ్చు.

ఐఫోన్ SE 4 తర్వాత ఆపిల్ టచ్ ఐడిని తొలగించింది. కానీ దానిని తిరిగి ఫోల్డబుల్ ఐఫోన్‌లో తీసుకురావాలని యోచిస్తోంది.

ఫేస్ ఐడి టెక్నాలజీ ఫోల్డబుల్ ఫోన్‌లలో అమర్చడం కష్టంగా ఉండవచ్చు. కాబట్టి ఆపిల్ సైడ్ బటన్‌కు టచ్ ఐడిని తీసుకువచ్చే అవకాశం.

ఆపిల్ దృష్టి AI-ఆధారిత లక్షణాలపై ఉంటుంది. ఇది ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత అధునాతనంగా, వినియోగదారు-స్నేహపూర్వకంగా చేస్తుంది.