ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఏసీ పేడడం వల్ల తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఏసీ ఎందుకు పేలుతుందో, పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలు తెగ వెతుకుతున్నారు
TV9 Telugu
ఏసీని భద్రంగా ఎలా వాడాలో తెలుసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఏపీ పేలకుండా ఉండాలంటే.. ఏసీ యూనిట్‌ను తరచూ చెక్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయిస్తూ ఉండాలి
TV9 Telugu
ఫిల్టర్లను శుభ్రపరచడం, రిఫ్రిజిరేంట్ లీక్ కాకుండా చూడడం వంటివి తరచూ చూసుకుంటూ ఉండాలి. 600 గంటల పాటు ఏసీ రన్ అయ్యాక ఖచ్చితంగా సర్వీసింగ్ చేయించాలి
TV9 Telugu
ఏసీని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పెట్టడం మంచిది. మంచి వెంటిలేషన్ ఉంటే ఏసీ వేడెక్కకుండా ఉంటుంది. గాలి ప్రవాహానికి ఎలాంటి అడ్డు లేకుండా చూసుకోవాలి
TV9 Telugu
నాణ్యమైన బ్రాండుకు సంబంధించిన ఏసీలే కొనాలి. ఏసీలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే వాటిని రీప్లేస్ చేసినప్పుడు నాణ్యమైన ఎలక్ట్రికల్ భాగాలతోనే రీప్లేస్ చేయాలి
TV9 Telugu
ఏసీ నుంచి అసాధారణ శబ్దాలు వస్తున్నా, వాసనలు వస్తున్నా వెంటనే ఏసీని ఆఫ్ చేయాలి.ఏసీ నుంచి పొగలు వస్తున్నట్టు అనిపిస్తే నీటిని చల్లకూడదు. ఏసీని ఆఫ్ చేశాక దానిని టెక్నీషియన్ వచ్చేవరకు వేయకపోవడమే మంచిది
TV9 Telugu
రోజులో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఏసీని ఆఫ్ చేసి ఉంచాల్సిన అవసరం ఉంది. దీని వల్ల ఏసీలు ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి
TV9 Telugu
ఇంట్లో ఏసీ వాడుతున్న వారు ఫైర్ సేఫ్టీ పరికరాలను కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది. స్మోక్ డిటెక్టర్లు మంటలను ఆపే పరికరాలు ఇంట్లో ఉంటే ప్రాణాపాయ పరిస్థితిలో తమనుతాము కాపాడుకోవచ్చు