TV9 Telugu
17 March 2024
ఇంత తక్కువ ధరలో
ఇన్ని ఫీచర్లా.?
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. వివో టీ3 5జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్‌ను ఈ నెల 21వ తేదీన లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్‌యంలో ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్‌సెట్‌తో పని చేస్తుంది. ఇక ఈ ఫోన్ ధర రూ. 20 వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందిస్తున్నారు. 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ దీని సొంతం.
ఈ ఫోన్‌ను క్రిస్టల్ ఫ్లేక్, కాస్మిక్ బ్లూ కలర్స్‌లో తీసుకురానున్నారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ / 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ సొంతం.
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించనున్నారని తెలుస్తోంది.
ఇక ఈ ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ54 రెసిస్టెంట్ ఫీచర్లను అందించారు. అలాగే మెమోరీ కార్డు ద్వారా మెమోరీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక్కడ క్లిక్ చేయండి..