ఐఫోన్ 15ప్రో ఫోన్‌ను టైటానియం బాడీతో రూపొందించారు. అత్యంత తేలికైన, దృఢమైన టైటానియాన్ని వ్యోమనౌకల్లో ఉపయోగిస్తారు. దీంతో ఐఫోన్15 ముందు ఫోన్స్‌తో పోల్చితే తక్కువ బరువు ఉంటుంది.
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఐఫోన్ 15లో 24 మెగాపిక్సెల్ సూపర్ హై రిజల్యూషన్ డిఫాల్ట్ సైజ్ ఫీచర్‌ను అందించారు. పోట్రెయిట్ మోడ్‌కి మారకుండానే పోట్రెయిట్ ఫొటోలు తీసుకోవచ్చు.
ఐఫోన్ 15లో ఏ17 ప్రో చిప్‌ను అందించారు. ఇది డివైజ్ పర్ఫామెన్స్‌ను మెరుగుపరుస్తుంది. యాపిల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద జీపీయూ రీడిజైన్ కావడం విశేషం.
కెమెరా విషయంలో భారీ మార్పులు చేసింది యాపిల్. ఇందులో 4K 60 FPS వీడియో రికార్డింగ్ కోసం Pro Max బేస్ స్టోరేజ్ వేరియంట్‌లో 256 జీబీ స్టోరేజ్ ఇచ్చింది.
ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ ఫోన్‌లలో మొదటిసారిగా కన్సోల్ గేమింగ్ టైటిల్స్‌ను అందించాయి. దీంతో యూజర్లకు మరింత మెరుగైన ఎక్స్‌పీరియన్స్ లభించనుంది.
ఇక ఐఫోన్ 15ని పూర్తిగా పర్యావరణ హితంగా డిజైన్ చేశారు. ఈ ఫోన్‌ను 100 శాతం రీసైకిల్ అల్యూమినియంతో తయారు చేశారు. అలాగే 100 శాతం రీసైకిల్ కోబాల్ట్ బ్యాటరీలు అందించారు.
జూమ్ ఫోటోగ్రఫీ కోసం కూడా యాపిల్ పెద్ద పీట వేసింది. ఐఫోన్ 15ప్రో మ్యాక్స్‌లోని 12 ఎంపీ టెలిఫొటో లెన్స్ 120 ఎమ్‌ఎమ్ వద్ద 5x జూమ్‌ను కలిగి ఉంది.
ఐఫోన్ 15లో క్యూ12 వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండర్డ్‌తో తీసుకొచ్చారు. అదనపు మ్యాగ్నెట్ రింగ్ ద్వారా వేగవంతమైన వైర్‌లెస్ ఛార్జింగ్ లభిస్తుంది.