స్మార్ట్‌ఫోన్‌ని క్లీన్ చేయడానికి చిట్కాలు..

26 August 2023

ఎంతో సమయం చేస్తున్న ఫోన్‌ని చాలామంది సరిగ్గా  పట్టించుకోరు. దీంతో  దుమ్ము పట్టి త్వరగా పాడైపోతుంది.

ఈ కారణంగా మళ్లీ డబ్బులు పెట్టి కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసి పరిస్థితి రాకుండా తరచుగా శుభ్రం చేయాలి. స్మార్ట్‌ఫోన్‌ని ఎలా శుభ్రం చేయాలో కొన్ని చిట్కాలు మీ కోసం.

దేశంలో చాలామంది స్మార్ట్‌ఫోన్‌లని సంవత్సరాలు మార్చకుండా ఉపయోగిస్తారు. అయితే ఫోన్‌ను క్లీన్ చేసే విషయంలో తప్పులు చేస్తారు.

పైపైన మాత్రమే తుడుస్తారు తప్ప ఎప్పుడు డీప్ క్లీన్ చేయరు. దీంతో ఫోన్ సమయానికి ముందే పాడై ఛార్జింగ్ పోర్ట్ సరిగ్గా పని కారణంగాఛార్జింగ్ వేగం తగ్గుతుంది.

స్పీకర్‌ దగ్గర దుమ్ము కారణంగా వాల్యూమ్ కూడా తగ్గుతుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ని అప్పుడప్పుడు డీప్‌ క్లీన్‌ చేస్తూ ఉండాలి.

మీరు కాటన్ ఇయర్‌బడ్‌ల సాయంతో స్మార్ట్‌ఫోన్‌లోని ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు కెమెరా, స్పీకర్ గ్రిల్‌ను సులభంగా శుభ్రపరచవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌ని ఏ క్లాత్‌తో పడితే ఆ క్లాత్‌తో తుడిస్తే డిస్‌ప్లేపై గీతలు పడుతాయి. దీని కోసం ఉత్తమంగా శుభ్రం చేయడానికి మైక్రోఫైబర్ క్లాత్‌ని ఉపయోగించాలి.

మార్కెట్లో రూ.100 నుంచి రూ.150 మధ్య దొరికే ఈ మైక్రోఫైబర్ క్లాత్‌తో శుభ్ర చేస్తే స్మార్ట్‌ఫోన్ బాడీకి ఎటువంటి హాని కలిగించదు.