స్మార్ట్ వాచ్‌ల విషయంలో ఈ తప్పులు.. ఆ సమస్యలకు కారణం..
01 December 2024
TV9 Telugu
స్మార్ట్ ఫోన్ వాడకం వలన రోజూ దాదాపు పది వేల బ్యాక్టీరియాలు శరీరంలోని ప్రవేశిస్తున్నాయని అంటున్నారు నిపుణులు.
దీంతో చాలా మంది జబ్బుల బారిన పడుతున్నారని ఇటీవల చేసిన అధ్యయనంలో వెలుగులోకి వచ్చిందని తెలిపారు నిపుణులు.
బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గిందంటే.. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎవరైతే ఎక్కువగా జబ్బుల బారిన పడుతున్నారో వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ఫ్లోరిడాలో చేసిన పలు పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్, స్మార్ట్ వాచ్ లపై ఎండ, దుమ్ము, ధూళి చేరతాయి.
టాయిలెట్ లోకి వెళ్లినా.. బయటకు ఎక్కడికి వెళ్లినా ఈ స్మార్ట్ వాచ్ లు వెంటే ఉంటాయి. ఇలా చెడు బ్యాక్టీరియా వాచ్‌లపై చేరి.. మీకు తెలీకుండానే శరీరంలోకి చేరుతోంది.
ప్రమాదకరమైన సాల్మొనెల్లా, స్టెఫిలోకాకస్, సూడోమోనాస్ వంటి బ్యాక్టీరియాలు చేరుతున్నాయి. ఈ బ్యాక్టీరియా సంఖ్య కూడా రిస్ట్ బ్యాండ్ల బట్టి ఉంటాయి.
ప్లాస్టిక్, రబ్బర్ వంటి వాటిపైకి ఈ బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుంది. ప్లాస్టిక్, రబ్బర్ వంటివి కాకుండా మెటాలిక్ రిస్ట్ బ్యాండ్‌తో వచ్చే వాచ్‌లను వాడితే చాలా మంచిది.