కారులో ఈ లోపాలు  కనిపిస్తున్నాయా.. వెంటనే అప్రమత్తం అవ్వండి..

09 August 2023

కారులో ముఖ్యమైన భాగం బ్యాటరీ. దానితో కారులోనూ పనులు అన్ని జరుగుతాయి. అందుకే బ్యాటరీ విషయంలో జాగ్రత్తగా వహించాలి.

కాలక్రమేణా, బ్యాటరీలో లోపాలు ఏర్పడడం సహజం. దీనిలో లోపాలు  కారణంగా కారులో కొన్ని సమస్యలు రావడం మొదలవుతాయి.

దీని వల్ల సమస్యలు రాకుండా హాయిగా ప్రయాణం చేయాలంటే ఈ లోపాలను సంబంధించిన కొన్ని సంకేతాలు ఏంటో చూద్దాం.

కారులో ఉండే  ఎలక్ట్రిక్ వస్తువులకు బ్యాటరీ చాలా అవసరం. ఇది పాడైతే హెడ్లైట్లు ఇతర లైట్స్ నుండి తక్కువ కాంతి వస్తుంది.

కారు స్టార్ట్ చేసేటప్పుడు పెద్ద శబ్దం వస్తే బ్యాటరీలో బలహీనత ఉందని తెలుసుకొని చెక్ చెయ్యాలి. లేకుంటే మార్గంమధ్యలో చిక్కుకుపోవచ్చు.

మీరు కీ ఆన్ చేసినప్పుడు వింత శబ్దాలు వినపడితే జాగ్రత్తగా వుండండి. సాధారణ శబ్దానికి భిన్నంగా క్రాంకింగ్ శబ్దం వస్తే  బ్యాటరీ పాడైందని అర్ధం.

దీని కారణంగా ఆపిన తర్వాత స్పార్క్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది జరిగితే, అగ్ని ప్రమాదం గురవుతుంది. బ్యాటరీ దీనికి కారణం కావచ్చు.

బ్యాటరీపై తుప్పు పట్టినట్లు కనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి దాన్ని చెక్ చేయాలి. సాధారణంగా 2-3 సంవత్సరాలలో బ్యాటరీని మార్చడం ముఖ్యం.