05 October 2023

తుఫాను సమయంలో ఫోన్‌ వాడకూడదా..? 

మెరుపు మెరిసినప్పుడు విద్యుత్‌ శక్తిని ఫోన్‌ తన వైపుకు ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు. పిడుగు పడే అవకాశం ఉందని చెబుతారు

దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే మెరుపులోని విద్యుత్‌ ఫోన్‌ టవర్ ద్వారా మీ ఫోనును చేరుకుంటుందని అంటారు. 

తుఫాను సమయంలో మెరుపులు, పిడుగులలోని విద్యుత్‌  ఫోన్‌కు చేరుకుని అది పేలవచ్చని అంటారు. 

అయితే ఇందులో నిజం లేదు.  మొబైల్ ఫోన్లు సిగ్నల్స్ కోసం రేడియో తరంగాలను, ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ వేవ్స్ ను తీసుకుంటాయి 

ఈ తరంగాల గుండా విద్యుత్ ఎప్పుడూ ప్రవహించదు. అంటే ఈ రేడియో తరంగాల ద్వారా విద్యుత్తు మీ ఫోన్‌కు ఎప్పటికీ చేరదు.

మొత్తంగా చూస్తే పిడుగుపాటు సమయంలో మొబైల్‌ ఫోన్ వాడకూడదనేది కేవలం భ్రమ మాత్రమే. 

ఎవరైనా తుఫాను సమయంలో కూడా మొబైల్‌ ఫోన్‌ను నిరభ్యరంతరంగా ఉపయోగించవచ్చు.  వైర్డ్‌ టెలిఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.