రోల్స్ రాయిస్ కారుపై గీతలు గీసి రూ.70 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి..!

Velpula Bharath Rao

03 December 2024

ఇది బ్రిటన్ దేశానికి చెందిన పాపులర్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయి స్క్రెడిట్ తయారు చేసింది.

రోల్స్ రాయిస్ కార్లు రేట్లు  కోట్లకు పడగలెత్తుతాయి. అయితే రోల్స్ రాయిస్ కారుపై గీత గీసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు ఓ వ్యక్తి..

మార్క్ కోర్ట్ అనే వ్యక్తి రోల్స్ రాయిస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రోల్స్ రాయిస్ కారుపై తన స్వంత చేతులతో 5 మీటర్ల కోచ్‌లైన్‌ను పెయింట్ చేస్తాడు.

దానికి అతను లక్షల రూపాయల జీతం పొందుతున్నాడు.

రోల్స్ రాయిస్ కారుకు పెయింట్ చేయడానికి మార్క్ దాదాపు రూ.70 లక్షలు కంపెనీ వారు చెల్లిస్తున్నారు.

మార్క్ 2003లో రోల్స్ రాయిస్ కంపెనీలో చేరాడు.

రోల్స్ రాయిస్ కారుపై పెయింట్ చేయడానికి, మార్క్ స్క్విరెల్ హెయిర్‌తో తయారు చేసిన చాలా ప్రత్యేకమైన బ్రష్‌ను ఉపయోగిస్తాడు

అతను తప్ప మరెవరూ ఈ పని చేయరు. అందుకే ఈ కంపెనీ అతనికి భారీగా చెల్లిస్తుంది