ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనివార్యంగా మారింది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం ఎక్కువైంది. కంపెనీలు సైతం ఏఐని ఉపయోగిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా పరిశోధకులు ఏఐ వినియోగంలో మరో ముందడుగు వేశారు. కేంబ్రిడ్జ్ పరిశోధకులు ఏఐని ఉపయోగించి సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు.
కొన్ని సందర్భాల్లో కంటికి కనిపించని ప్రమాదకరమైన వాయువులు ఉంటాయి. ఇవి మానవులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలాంటి వాయువులను ఏఐతో గుర్తించవచ్చు.
ఏఐని ఉపయోగించి , సెన్సార్‌తో కంటికి కనిపించని ఆ బ్యాక్టీరియను గుర్తించే టెక్నాలజీని రూపొందించారు. ఇది ఇళ్లు, ఆఫీసుల్లో ఉండే విషపూరిత వాయు కాలుష్యాన్ని గుర్తిస్తుంది.
వాల్ పెయింట్స్, వాడని ఫర్నిచర్‌పై ఎక్కువగా విషపూరిత వాయువులు ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆస్తమా పేషన్స్‌కు ఇది ప్రమాదకరం.
ఇలాంటి విషయావులు మనకు తెలియకుండానే శరీరంలో ప్రవేశిస్తాయని పరిశోధకులు చెబుతున్నరు. వీటివల్ల వెంటనే ప్రభావం లేకున్నా, దీర్ఘకాలంలో దుష్ప్రభావం చూపుతుంది.
దీర్ఘకాలంలో వీటి వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
ఏఐని ఉపయోగించి స్మోకీ మెటీరియల్‌తో తయారు చేసిన చిన్న సెన్సార్‌ను అభివృద్ది చేశారు. అది ఏఐని ఉపయోగించి కంటికి కనిపించని వాయువులను గుర్తిస్తుంది.