రియల్‌మీ 12 ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌లో ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 12 వేలలోపు ఉండనుంది.
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.72 ఆంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించనున్నారు.120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 45 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో డ్యూయల్ స్పీకర్లు అందించనున్నారు. ఈ ఫోన్ మందం 0.77 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఈ ఫోన్‌లో పీసీ కూలింగ్ ఛాంబర్ కూడా ఈ ఫోన్‌తో అందించనున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే ఇందులో ప్రత్యేకంగా ఎయిర్ జెస్చర్ ఫీచర్‌ను ఇచ్చారు. ఫోన్‌ను ముట్టుకోకుండానే ఆపరేట్ చేయవచ్చు.
ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ను ఏప్రిల్ 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో లాంచ్ చేయనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
చైనా మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. 1399 యువాన్లుగా ఉంది. అయితే భారత్‌లో ఈ ఫోన్ ధర రూ. 12 వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.