భూమిపై స్థలాన్ని అమ్మినట్లే చంద్రుడిపైనా స్థలాన్ని విక్రయిస్తున్నారు.

చంద్రుడిపై స్థలాన్ని భూమిపై రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.

మరి చంద్రుడి స్థలాన్ని విక్రయించేది ఎవరు? చంద్రుడికి యజమాని ఎవరు?

Lunarregistry.com అనే వెబ్‌సైట్ చంద్రుడిపై స్థలాన్ని పట్టా చేస్తోంది.

అయితే, చంద్రుడి ఉపరితలపై తమకు హక్కు లేదని కూడా సదరు వెబ్‌సైట్ చెబుతోంది.

ఎందుకంటే చంద్రుడికి యజమాని లేడు కాబట్టి.

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చంద్రుడిపై స్థలాన్ని కొనుగోలు చేసినట్లు సదరు వెబ్‌సైట్ ప్రకటించింది.

వెబ్‌సైట్ ప్రకారం.. చంద్రుడిపై ఎకరం స్థలం ఖరీదు దాదాపు రూ.3,075.

ఔటర్ స్పేస్ ట్రీటీ 1967 ప్రకారం, ఏ దేశం, ఏ వ్యక్తి కూడా చంద్రుడిపై హక్కులు పొందలేరు.

చంద్రుడిపై స్థలం కొనుగోలు చేయడం వలన వారేమీ హక్కులు పొందలేరు.