చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.
నిజానికి ఈ ఫోన్‌కు సంబంధించిన గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నా. తాజాగా కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
అక్టోబర్ 12వ తేదీన ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఒప్పో సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచింగ్ ఈవెంట్‌ను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఒప్పో తెలిపింది.
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ స్మార్ట్ ఫోన్‌లో 4300 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
44 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 56 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.
కెమెరా విషయానికొస్తే ఇందులో 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 32 ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరాను అందించనున్నారు. 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ సొంతం.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్‌సెట్ ద్వారా పని చేస్తుంది.