వన్‌ప్లస్‌ నుంచి స్టన్నింగ్‌ ఫోన్స్..

01 January 2023

వన్‌ప్లస్‌ కొత్తేడాదిలో రెండు ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తోంది. వన్‌ప్లస్‌ 12, వన్‌ప్లస్ 12ఆర్‌ పేరుతో రెండు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్‌ను లాంచ్‌ అయ్యాయి. 

ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ భారత మార్కెట్లోకి జనవరి 23వ తేదీన లాంచ్‌ కానున్నాయి. వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ ఫోన్‌ను బ్లాక్‌ కలర్‌లో లాంచ్‌ చేయనుననట్లు తెలుస్తోంది. 

వన్‌ప్ల్‌ 12 స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 58,00 నుంచి రూ. 60,000 మధ్యలో ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌లో 6.82 ఇంచెస్‌ స్క్రీన్‌ను అందించనున్నారు. 

1,440 x 3,168 పిక్సెల్‌, 120Hz రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్‌ సొంతం. ఇందులో 50MP+64MP+48MP రెయిర్ కెమారాను అందించారు. 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఈ ఫోన్‌ సొంతం. 

బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 100 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్స్‌ వైర్‌లెస్, 10 వాట్స్‌ రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,400mAh బ్యాటరీని అందించనున్నారు.

ఇక వన్‌ప్లస్‌ 12ఆర్‌ వేరియంట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 40,000 నుంచి రూ. 42,000 మధ్య అందుబాటులో ఉండనుంది. 

ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన కూడిన ఎల్‌టీపీఓ స్క్రీన్‌ను అందిస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 

ఇందులో 50MP+8MP+2MP కెమెరాలు ఉండనున్నాయి, సెల్ఫీల కోసం 16MP కెమెరాను ఇస్తారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 100W వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని అందించారు.