బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2024లోOnePlus తన సెకెండ్ జెనరేషన్ వాచ్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ వాచ్2 పేరుతో ఈ కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది.
ఈ వాచ్ 2.5D బ్లూ కలర్ క్రిస్టల్ కవర్‌తో వస్తుంది. వాచ్ ఛాసిస్ MIL-STD-810H స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపందించారు. ఈ స్మార్ట్ వాచ్ కేవలం 80 గ్రాముల బరువు ఉంటుంది.
ఇక వన్‌ప్లస్ వాచ్2ను ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌తో రూపొందించారు. ఇందులో 466 x 466 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 1.43 ఇంచెస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు.
600 నిట్స్ బ్రైట్ నెస్‌ను ఈ వాచ్ స్క్రీన్ సొంతం. వన్‌ప్లస్ వాచ్ 2 BES 2700 MCU ఎఫిషియెన్సీ చిప్ సెట్ తో పాటు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ W5 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఇక వన్‌ప్లస్ వాచ్ 2 గూగుల్ వియర్ ఓఎస్ 4 బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేయనుంది. ఇందులో 2GB RAM, 32GB స్టోరేజ్ సామర్థ్యాన్ని ఇవ్వనున్నారు.
ఇక వన్‌ప్లస్ వాచ్2 వాచ్‌లో 2500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించానున్నారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. 60 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.
ధర విషయానికొస్తే వన్‌ప్లస్ వాచ్ 2 ధరను రూ. 24,999గా నిర్ణయించారు. మార్చి 4వ తేదీ నుంచి ఈ వాచ్ సేల్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.
ఇక ఈ వాచ్‌ను ఐసీఐసీ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే.. రూ.2,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. మార్చి 4వ తేదీన తొలి సేల్ ప్రారంభం కానుంది.