27 August 2023

418 రూపాయలకే మోటోరోలా 8GB ఫోన్.. 

తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లను కలిగిన స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ మోటోరోలా ఈ13 ఫోన్‌పై ఓ లుక్ వేయండి..

Motorola E13 స్మార్ట్‌ఫోన్‌‌పై ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఓ భారీ ఆఫర్‌ని ప్రకటించింది. ఈ క్రమంలో మీరు మోటోరోలా ఈ13 ఫోన్‌ని రూ.418కే సొంతం చేసుకోవచ్చు.

మోటోరోలా ఈ13 స్మార్ట్‌ఫోన్‌లోని 8GB RAM+128 GB ROM వేరియంట్‌ అసలు ధర రూ10,999 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ద్వారా రూ.8,999లకే కొనుగోలు చేయవచ్చు.

ఇందుకోసం మీరు ప్రతి నెల రూ.418 చొప్పున 24 నెలల పాటు చెల్లిస్తే సరిపోతుంది. ఇంకా కొనుగోలు కోసం మీరు ఏదైనా బ్యాంక్ కార్డులను ఉపయోగిస్తే తక్షణమే రూ.500 డిస్కౌంట్ కూడా పొందుతారు.

ఇక మోటోరోలా ఈ13 స్మార్ట్‌ఫోన్‌లో 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 650MHz GPU ఉన్నాయి.

అలాగే స్మార్ట్‌ఫోన్‌లో వెనుక వైపున 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా.. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ ఉంది.

బ్యాటరీ బ్యాకప్ కోసం 5,000mAh, 10W ఛార్జింగ్ మద్దతుతో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

కనెక్టివిటీ కోసం, స్మార్ట్‌ఫోన్‌లో 4G VoLTE, WiFi (2.4 Ghz + 5Ghz), బ్లూటూత్, GPS, USB టైప్-సి కేబుల్ లభిస్తాయి.