మోటరోలా నుంచి బడ్జెట్‌ ఫోన్‌.. హైలెట్‌ ఫీచర్స్‌ 

03 January 2023

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం మోటరోలా కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. మోటో జీ34 పేరుతో 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నారు. 

ఇప్పటికే చైనా మార్కెట్లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి రాగా, త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. జనవరి 9వ తేదీన ఈ ఫోన్‌ తీసుకురానున్నట్లు సమాచారం. 

ప్రముఖ ఈ కామర్స్‌ సైట్స్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, రిటైల్‌ స్టోర్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయంటే. 

మోటో జీ34 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించానున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్‌రెష్ రేట్ ఈ ఫోన్‌ సొంతం. 

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆక్టా కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 696 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. 

మోటోరోలో జీ 34 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను సైడ్‌కు ఇచ్చారు. ధర విషయానికొస్తే సుమారు రూ. 12,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.