ఇంత తక్కువ ధరలో 5జీ ఫోనా.. కేవలం.. 

30 September 2023

దేశీయ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం లావా, బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. లావా బ్లేజ్‌ ప్రో పేరుతో ఈ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. 

ఈ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ. 12,499గా ఉంది. ఏడాది వారెంటీ కూడా అందిస్తున్నారు. 

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ అమ్మకాలు లావా ఇ స్టోర్‌, ఈకామర్స్‌ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ద్వారా అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. 

 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 1,080x2,460 పిక్సెల్‌ డిస్‌ప్లే  ఈ ఫోన్‌ సొంతం. 

ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 396ppi పిక్సెల్ డిస్‌ప్లేను అందించారు. 

ఇక ఆక్టాకోర్ మీడియాటెట్‌ డైమెన్సిటీ 6020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌ ఏదైనా రిపేర్‌ అయితే ఇంటి వద్దకే వచ్చి చేస్తారు

ఈ స్మార్ట్ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తక్కువ ధరలోనే ఏకంగా 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. 

ఇక సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే 33 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు