28 August 2023

ఆదిత్య ఎల్‌-1 ప్రయోగంపై ఇస్రో కీలక ప్రకటన

వరుస ప్రయోగాలతో అద్భుతాలు క్రియేట్ చేస్తోన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)

నెల రోజుల క్రితమే చంద్రయాన్ 3 ప్రయోగించిందన ఇస్రో.. ఆ తర్వాత పీఎస్‌ఎల్వీ- సీ56 కమర్షియల్ ప్రయోగం విజయవంతం.

చందమామపై గురిపెట్టిన ఇస్రో.. ఇటు సూర్యుడిపైకీ అస్త్రాన్ని ఎక్కుపెడుతోంది. దానికి ఆదిత్య L1గా నామకరణం చేసింది. 

ఆదిత్య ఎల్ 1 పేరుతో ఇస్రో ప్రయోగించబోయే శాటిలైట్ ప్రయోగం తేదీ, సమయం ఫిక్స్ అయ్యాయి.  

2023, సెప్టెంబర్ 2న ఉ.11:50 గంటలకు ఆదిత్య ఎల్‌-1 ప్రయోగానికి సిద్దమవుతోంది ఇస్రో 

ఆదిత్య L-1 మిషన్‌కి సంబందించిన శాటిలైట్‌ను బెంగుళూరులో రెడీ చేసింది ఇస్రో.

శ్రీహరికోట నుంచి PSLV -సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు శాస్త్రవేత్తలు

ఆదిత్య L1 అనేది సూర్యుని గురించి అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్. 

భూమి నుండి 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ లాగ్రాంజ్ పాయింట్-1 చుట్టూ హాలో కక్ష్యలోకి అదిత్య L-1.

ఇది సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాన్ని గమనించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది.