ఐఎస్‌ఓ 17లో అదిరిపోయే ఫీచర్లు..

21 September 2023

ఎవరైనా ఫోన్‌ చేసిన సమయంలో లిఫ్ట్‌ చేయకపోతే.. ఈ ఫీచర్‌ ద్వారా వీడియో మెసేజ్‌ను పంపించొచ్చు. మీరు ఎందుకు కాల్‌ చేశారో చెబుతూ వీడియో రికార్డ్‌ చేసి పంపిస్తే చాలు. ఫేస్‌ టైమ్‌ యాప్‌లో ఈ వీడియో కనిపిస్తుంది.

ఫేస్‌ టైమ్‌ వీడియో మెసేజెస్.. 

ఈ ఫీచర్‌ సహాయంతో ఫొటోలో కనిపించే ప్రతీ వస్తువును స్టిక్కర్‌గా మార్చుకోవచ్చు. ఫొటోలోని వస్తువు మీద నొక్కితే అవుట్ లైన్‌ ఏర్పడుతుంది. యాడ్‌ స్టిక్కర్‌ ఆప్షన్‌ సెలక్ట్ చేసుకుంటే సరి దానంతటదే స్టికర్‌గా మారుతుంది.

నచ్చిన దాన్ని స్టిక్కర్స్‌గా.. 

సఫారీ బ్రౌజర్‌లో నచ్చిన కథనాలు, వెబ్‌సైట్స్‌ను చదడానికి బదులు వినేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. వాయిస్‌ అసిస్టెంట్‌ సిరి ఈ పని చేసి పెడుతుంది. 

వినేందుకు వీలుగా.. 

 ఏదైనా ఫొటోను జూమ్‌ చేసిన సమయంలో కొద్ది సెకండ్ల ఆపటు క్రాప్‌ బటన్‌ కనిపిస్తుంది. ఆటోమేటిక్‌గా ఎడిట్‌ మోడ్‌లోకి వెళ్తుంది. డన్‌ నొక్కితే ఫొటో క్రాప్‌ అవుతుంది. 

ఫొటో క్రాపింగ్‌.. 

ఐఓఎస్‌ 17లో లైవ్‌ వాయిస్‌ మెయిల్‌ సదుపాయాన్ని డిఫాల్ట్‌గా అందించారు. దీంతో వాయిస్‌ మెయిల్ ప్లే అవుతున్నప్పుడే అది అప్పటికప్పుడు టెక్ట్స్‌ రూపంలో మారుతుంది. 

 లైవ్‌ వాయిస్‌ మెయిల్‌.. 

స్నేహితులకు, కుటంబ సభ్యులకు మనం ఎక్కడున్నామో తెలియజేసేందుకు ఉపయోగపడేదే ఈ చెక్‌ ఇన్‌ ఫీచర్‌. ఏవైనా చిక్కుల్లో ఉన్నప్పుడు వెంటనే అలర్ట్ చేస్తుంది.

చెన్‌ ఇన్‌.. 

ఈ స్టాండ్‌ బై ఫీచర్‌ను ఐఫోన్‌ను ఛార్జ్‌ చేసేప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసి ఐఫోన్‌ను ఒక సైడ్‌లో ఉచితే స్క్రీన్‌ టైమ్‌, వెదర్‌, ఫొటోలు చూడొచ్చు. 

స్టాండ్‌ బై.. 

ఒకేసారి రెండు భాషలు మాట్లాడుకునేలో సిరిలో కొత్త ఫీచర్‌ను జోడించారు. దీంతో వాయిస్‌ అసిస్టెంట్‌లో ఒకేసారి రెండు భాషల్లో సమాచారం పొందొచ్చు. 

సిరిలో కొత్త ఫీచర్‌..